ప్రాథమిక హక్కుల పరిరక్షణ కోసం అందేరీలో బీఆర్ఎస్ నిరసన !
7 సంవత్సరాలకు పైగా నివసిస్తున్న DT/NT/OBC/SBC/SC/STలందరికీ కుల ధృవీకరణ కుల ధ్రువీకరణ పత్రం కావాలి
ముంబై 10-8-2౦023 : 10 ఆగస్టు 2023న బిఆర్ఎస్ చందివాలి అసెంబ్లీ సమన్వయకర్త చౌవల్ రమేష్ మాల జి నాయకత్వంలో మధ్యాహ్నం 3.30 గంటల నుండి సాయంత్రం 5.30 గంటల వరకు భారత్ రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) నిరసన ప్రదర్శన నిర్వహించారు.

విద్యార్థుల  ప్రాథమిక హక్కులను పరిరక్షించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమైనందుకు ముంబైలోని అందేరీ తహ్సిల్దర్ కార్యాలయం ముందు బి.ఆర్.ఎస్ చే నిరసన జర్పారు. 

అనేక సందర్భాలలో ఫీజులు ఆలస్యంగా చెల్లించినందుకు ప్రైవేట్ స్కూల్ కళాశాలలు విద్యార్థులను బెంచీలపై లేదా తరగతి గదుల వెలుపల నిలబెట్టడం, వారికి లీవింగ్ సర్టిఫికేట్‌లను అందజేయడం జరుగుతున్నాయి ఇప్పుడు ఫీజు చెల్లించే వరకు పాఠశాలకు రానివ్వకుండా నిలుపుదల చేసి, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21A ప్రకారం "హామీ ఇవ్వబడిన విద్యను" పాఠశాల ద్వారా కోల్పోయింది.  

ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజులు/ఛార్జీలపై నియంత్రణ లేదు, ప్రైవేట్ పాఠశాలలకు దోపిడీకి లైసెన్స్ ఇచ్చినట్టు ఐంది. ఇంతకుముందు నెలవారీ రుసుము వసూలు చేయబడింది, ఇప్పుడు వార్షిక లేదా అర్ధ-వార్షిక వసూలు చేయబడుతోంది, దీని కారణంగా చాలా మంది తల్లిదండ్రులు అప్పుల్లో మునిగిపోతున్నారు.

ప్రైవేట్ స్కూల్ మేనేజ్‌మెంట్‌ వేధింపులను వెంటనే ఆపాలాంటు బిఆర్ఎస్ పార్టీ అందేరీ తహ్సిల్దర్ కార్యాలయంలో పలు డిమాండ్లతో మెమోరాండం సమర్పించారు. అందులో పైన పేర్కొన్న విధంగా విద్యార్థులను తరగతులకు హాజరు కావడానికి, వేధింపులను ఆపడానికి వెంటనే అట్టి స్కూల్ మేనేజ్‌మెంట్‌ని డైరెక్ట్ చేయండి. ఫీజులు చెల్లింపుల కోసం పిల్లలపై జరుగుతున్న వేధింపులను ఆపడానికి మహారాష్ట్రలోని అన్ని ప్రైవేట్ స్కూల్లకు సర్క్యులర్‌ జారీ చేయండి. ఫీజు నియంత్రణ చేసి ప్రతి నెల ఫీజు కటడం మొదలు పెట్టాలి.

మరో ప్రముఖమైన ఎస్సి & ఎస్టి ఆర్డర్స్ (సవరణ) చట్టం 1976ని అమలు చేయాలనే డిమాండ్‌ సమర్పించారు. 18.9.1976లో లేదా అంతకు ముందు మహారాష్ట్రలో నివసిస్తున్న ఎస్సి ఎస్టిలకు కుల ధృవీకరణ పత్రాలను జారీచేసి, రాష్ట్రంలో అన్ని సౌకర్యాలకు అర్హులను చేయండి. 1976న లేదా అంతకు ముందు రాష్ట్రంలో నివసిస్తున్న DT, NT, OBC, SBCలకి చెందిన వ్యక్తులకు కూడా తప్పనిసరిగా "కుల ధృవీకరణ పత్రాల"ను జారీ చేయాలని పొందుపర్చారు.

మహారాష్ట్రలో 7 సంవత్సరాలకు పైగా నివసిస్తున్న DT/NT/OBC/SBC/SC/STలందరికీ కుల ధృవీకరణ పత్రాలను జారీచేసి, రాష్ట్రంలో అన్ని సౌకర్యాల కోసం మహారాష్ట్ర చట్టం నెం. 23 ఆఫ్ 2001 మరియు మహారాష్ట్ర SC, DT(VJ), NT, OBC & SBC కుల ధృవీకరణ  (జారీ మరియు ధృవీకరణ నియంత్రణ) నియమాలు, 2012 (Maharashtra Scheduled Castes, De-Notified Tribes (Vimukta Jatis), Nomadic Tribes, Other Backward Classes And Special Backward Category (Regulation Of Issuance And Verification Of) Caste Certificate Rules, 2012) ఆర్డినెన్స్‌ను ప్రకటించి మహారాష్ట్ర శాసనసభ శాసన మండలి లో శీతాకాల సమావేశాలలో బిల్లును  ప్రవేశపెట్టి ఆమోదించవలసిందిగా డిమాండ్ చేశారు .

ఈ పోరాటంలో బిఆర్ఎస్ ముంబై ప్రాంతాధ్యక్షులు హేమంత్‌కుమార్ బద్ది, ముంబై ఉపనగర జిల్లా సమన్వయకర్త సంజయ్ నింబాల్కర్, కళ్యాణ్ లోక్ సభ సమన్వయకర్త జయప్రకాష్ పవార్, చెంబర్ అసెంబ్లీ సమన్వయకర్త రాజేష్ జాదవ్, బంద్ర (E) అసెంబ్లీ సమన్వయకర్తలు  సందీప్ కోమరెల్లీ, నర్పక లక్ష్మణ మహారాజ్, బంద్ర (W) అసెంబ్లీ సమన్వయకర్త శంకర్ ద్రావిడ్, పదాదికారులైన మరంపెల్లి  అంజిబాబు, కొమ్ముల నాగరాజ్, బండగుండ  రమేష్, లవ్కుష్ పస్వాన్, సంతోష్ శర్మ, అంకుష్ గవంకర్, గౌరవ్ వర్మ, దీపక్ యాదవ్, ఎక్నత్ సువరే, సచిన్ కొన్నక్, నితేష్ పాలేకర్, వెంకటేష్ కొలి, తదితరులు ఉన్నారు.