ముంబై 11.10.2023 : రాబోయే అంబేడ్కర్ వర్ధంతి నిమిత్తంగా ముంబైకి తెలంగాణకు ప్రత్యేక రైళ్లు నడపాలని భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్)
ముంబై నాయకులు కేంద్ర రైల్వే మంత్రి పేరున తానే రైల్వే స్టేషన్ మాష్టర్ కు వినతిపత్రం సమర్పించారు.
అయితే అందులో డా బాబాసాహెబ్ అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా డిసెంబర్ 5న కరీంనగర్-దాదర్ (ముంబై), నల్గొండ-దాదర్ మధ్య ప్రత్యేక రైళ్ల కోసం. మరోవైపు అజంతా ఎక్స్‌ప్రెస్‌ను ముంబై వరకు పొడిగించాలని, నాందేడ్ రాజ్యరాణి ఎక్స్‌ప్రెస్, పన్వెల్ ఎక్స్‌ప్రెస్‌లను కరీంనగర్ వరకు అలాగే కాజీపేట -దాదర్ వరకు క్రమబద్ధీకరించాలని కోరారు.
కరీంనగర్ ముంబై మధ్య ప్రత్యేక రైలు లింగంపేట్- జగిత్యాల్, కోరుట్ల, మెట్‌పల్లి, మోర్తాడ్, ఆర్మూర్, నిజామాబాద్, నాందేడ్, మన్మాడ్ వద్ద ఆగుతుంది, డిసెంబర్ 5న మధ్యాహ్నం బయలుదేరి తెల్లవారుజామున చేరుకుంటుందని విన్నవించారు.
నల్గొండ నుంచి డిసెంబర్ 5న మధ్యాహ్నం నడిచే స్పెషల్ రైలు నరకట్పల్లి, చిట్యాల, వలిగొండ, పగిడిపల్లి, ఘట్కేసర్, సికింద్రాబాద్, తాండూర్, వాడి, సోలాపూర్ మరుసటిరోజు ఉదయం ముంబై చేరుకుంటుంది. తిరుగు దిశలో రెండు రైళ్లు డిసెంబర్ 6న సాయంత్రం 4గంటల తర్వాత ముంబై నుంచి బయలుదేరవచ్చు.
అలాగానే అజంతా ఎక్స్‌ప్రెస్ రైలు నం: 17063/4ను ముంబై సి.ఎస్.టి.ఎం లేదా ఎల్.టి.టి వరకు పొడిగించాలని పాత డిమాండ్ ను పొందుపర్చారు. అదేవిధంగా పన్వెల్ ఎక్స్‌ప్రెస్ రైలు నం: 17613/4 కరీంనగర్ వరకు, రాజ్యరాణి ఎక్స్‌ప్రెస్ రైలు నం: 17611/2 నిజామాబాద్, ఆర్మూర్, మోర్తాడ్, మెట్‌పల్లి, కోరుట్ల, లింగంపేట్- జగిత్యాల, గంగాధర వద్ద హాల్ట్‌లు ఏర్పాట్లు చేయగలరు.
కాజీపేట స్పెషల్ ఫేర్ రైలు నం: 07195/6 మెయిల్/ఎక్స్‌ప్రెస్ రైలుగా రేగులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు.
ఈ భేటీలో బిఆర్ఎస్ కొంకణ్ ముంబై విభాగం సోషల్ మీడియా ప్రచారకులు మహేంద్ర కంసే, తానే లోక్ సభ సహాయ సమన్వయకర్త దొనకొండ సంతోష్ ఇతర నాయకులు ఉన్నారు.