ములుండ్ ముంబై 23.10.2023 : ఇటీవల ముంబై మహానగరంలో భారత రాష్ట్ర సమితి (బి.ఆర్.ఎస్) పార్టీ చాపకింద నీరులాగా విస్తరిస్తున్న విషయాన్ని మనం మర్చిపోలేం. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ సర్కార్ నిర్వహిస్తున్న సంక్షేమ పథకాలు ముంబై వలసజీవుల్లో అనేక ఆశాల్ని నిప్పిన విషయం అవగతమే.
అందులో భాగంగానే ముంబైలో జగుతున్న పలు బతుకమ్మ సంబరాలల్లో బి.ఆర్.ఎస్ నేతలను మరి పిల్చి సన్మానాలు సత్కారాల పర్వం కొనసాగింది. సోమవారం ఒకే రోజు రెండు చోట్ల ఆ ఈవెంట్లు జరగాయి. అయితే తూర్పు ములుండ్ లోని తెలుగు సేవ సంఘం ఛైర్మన్ వారి టీం ముంబై రీజియన్ బి.ఆర్.ఎస్ నేతలైన బద్ది హేమంత్ కుమార్, థానే లోక్ సభ కో-కోఆర్డినేటర్ దొనకొండ సంతోష్, చందివలి అసెంబ్లీ కోఆర్డినేటర్ చౌవల్ రమేష్ గార్లకు చేతులో కోబరికాయ ఇచ్చి శల్వా కప్పి ఘనంగా సన్మానించారు.
మరోవైపు అదే ములుండ్ లోని బతుకమ్మ పండుగ నిమిత్తంగా స్థానిక తెలంగాణ వలసజీవుల కార్మికుల పురాతనమైన "భారత్ లేబర్ సేవ సంఘం" వారిచే కూడా సత్కారాలు జరగాయి.
వీరికి తోడుగా ముంబై బహుజన గాయకులు భీంరత్న మాలజీ, ఉద్యమ జర్నలిస్ట్ మూల్ నివాసి మాలజీ గార్లను కూడా ఘనస్వాగతం పలుకుతూ ఘన సన్మానాలు జర్పారు.