మేట్ పల్లి 15.01.2025 : జగిత్యాల జిల్లా మేట్ పల్లి పట్టణం సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో సబ్ రిజిస్టర్ ఆసిపోద్దిన్ రూ. 5,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. కరీంనగర్ ఏసీబీ డిఎస్పి వివి రమణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం బ్యాంకు ఉద్యోగిగా పని చేస్తున్న ఇబ్రహీంపట్నం మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన సుంకే విష్ణు మేట్ పల్లి పట్టణం సాయిరాంనగర్ లోగల 266 గజాల ఇంటి స్థలాన్ని సెల్డీడ్ మరియు మోర్టిగేజ్ రిజిస్ట్రేషన్ కోసం రూ. 10,000 డిమాండ్ చేయడంతో, అంత మొత్తం చెల్లించుకోలేనని రూ. 5,000 బేరం కుదుర్చుకున్నారు. కానీ అన్ని సక్రమంగా ఉండగా కూడా డబ్బులు ఇవ్వడం ఇష్టం లేక ఏసీబీ ని ఆశ్రయించాడు. అధికారుల పన్నాగం ప్రకారం లంచం డబ్బులు తీసుకొనుచుండగా రెడ్ హ్యాండిగా పట్టుకున్నారు. సబ్ రిజిస్టర్ ఆసిపోద్దిన్ తో పాటు ఇందులో సూత్రధారులైన ఔట్సోర్సింగ్ అటెండర్ బి. రవికుమార్, డాక్యుమెంట్ రైటర్ యొక్క అసిస్టెంట్ ఆర్మూరు రవి ఈ ముగ్గురిని అదుపులో తీసుకున్నారు.
- బాలే అజయ్ - 9290277727