విలేపార్లే 14.01.2025 : ముంబై మహానగరం నిర్మాణంలో గొప్ప కాంట్రాక్టర్ దివంగత విఠల్ సాయన్న యాదవ్ ప్రముఖ పాత్ర ఉందన్నది జగమెరిగిన సత్యం. ఆయనను జ్ఞాపకం చేసుకోవడం ప్రతీ కార్మికుని కర్తవ్యం. సాయన్న యాదవ్ ముంబై కోలాబ ప్రాంతలో లేబర్ గా పని చేసుకుంటూ ఓ గొప్ప కాంట్రాక్టర్ గా ఎదిగారు. అంతేకాకుండా తాను గొప్ప మానవత్వం గల వ్యక్తి. ఆయన కాంట్రాక్టర్ గా మారిన అనంతరం తన నివాసాన్ని ఆసుపత్రిగా మార్చి అడ్డా/నాకా వర్కర్లకు సేవలు అందించిన మహాపురుషులు. ఆ సమయంలో మహారాష్ట్రలో గొప్ప కాంట్రాక్టర్ లైన మహాత్మ జ్యోతిరావు ఫూలే, అయ్యవారు లాంటి వారి ప్రభావం సాయన్న యాదవ్ పై బలంగా పడిందని "మజ్దూర్ మజ్దూర్ భాయ్ భాయ్ మజ్దూర్ సంఘటన" అధ్యక్షులు చౌవల్ రమేష్ మాలజీ పేర్కొన్నారు.
పశ్చిమ విలేపార్లే నాకా వద్ద మజ్దూర్ సంఘటన ఆధ్వర్యంలో దివంగత సాయన్న యాదవ్ 159వ జయంతి ఘనంగా నిర్వహించారు. ఆరంభంలో ఆయన చిత్రపటానికి కార్మిక లోకం పూలమాలలు వేసి చేతులు జోడించి మనసార నివాళులర్పించారు. సాయన్న యాదవ్ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. చివర్లో మజ్దూర్ సంఘటన ద్వారా మీటింగ్లో పాల్గొన్న కూలీనాలీ జనానికి మిఠాయిలు పంచారు.
- ఎం. మాలజీ : 9869010890